AP: విజయవాడలో సంచలనం సృష్టించిన కళ్యాణి హత్య కేసులో నిందితుడు షఫీ అబ్దుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. కుమారుడి విషయంలో బెదిరించడంతోనే కళ్యాణిని ఇంటికి పిలిచి హత్య చేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి, వాటిని కాలువలో పడేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు షఫీ అబ్దుల్లాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.