
మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ (వీడియో)
తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎం రేవంత్రెడ్డి, ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెటర్గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన అజారుద్దీన్, 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, 2009లో కాంగ్రెస్లో చేరి ఎంపీగా గెలుపొందారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు.




