హిట్ అండ్ రన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

85చూసినవారు
హిట్ అండ్ రన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో గత ఏడాది జరిగిన హిట్ అండ్ రన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం మత్తులో కారు నడుపుతూ దంపతులను ఢీకొట్టి, మహిళ మృతికి కారణమైన నిందితుడు మిహిర్ షాకు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఇలాంటి వారికి తగిన గుణపాఠం నేర్పించాల్సిందేనని, చేసిన నేరానికి కొద్ది రోజులు జైల్లో ఉండాలని ఆదేశించింది. గత ఏడాది వర్లీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో శివసేన నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ షా, స్కూటీని ఢీకొట్టడంతో కావేరి నక్వా అనే మహిళ మృతి చెందగా, ఆమె భర్త గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్