
హైఅలర్ట్.. అడవిని వదిలి ఏపీలోకి వచ్చిన మావోలు
ఏపీలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతోంది. అడవిని వదిలి మావోయిస్టు అగ్రనేతలు ఏపీకి వచ్చారు. రాష్ట్రంలో 60-70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో 32 మంది, ఏలూరులో 12 మంది, కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు గుర్తించారు.




