ధర్మస్థల దర్యాప్తులో కీలక ముందడుగు.. బయటపడిన అవశేషాలు

61చూసినవారు
ధర్మస్థల దర్యాప్తులో కీలక ముందడుగు.. బయటపడిన అవశేషాలు
కర్ణాటకలోని ధర్మస్థలలో జరిగిన సామూహిక ఖననం కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ధర్మస్థల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో మృతదేహాలను పూడ్చినట్టు సమాచారం ఇచ్చిన ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన 13 ప్రదేశాల్లో సిట్ అధికారులు తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం ఒక ప్రదేశంలో మానవ అవశేషాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం. ఫోరెన్సిక్‌ బృందం అవశేషాలను ల్యాబ్‌కు పంపారు.

సంబంధిత పోస్ట్