ఏపీ, తెలంగాణ పురాతన వస్తువుల విభజనపై కీలక అడుగు

52చూసినవారు
ఏపీ, తెలంగాణ పురాతన వస్తువుల విభజనపై కీలక అడుగు
తెలంగాణ మ్యూజియంలో ఉన్న పురాతన వస్తువుల విభజనపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం.. రెండు రాష్ట్రాల మధ్య వస్తువుల పంపకం కోసం 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీలతో సమావేశమై, పురాతన వస్తువుల గుర్తింపు, ఎంపిక, పర్యవేక్షణ, పంపిణీ, బదిలీ, భద్రత వంటి చర్యలు తీసుకోనుంది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్