'KGF' సినిమాలో 'చాచా' పాత్రతో పాపులరైన కన్నడ నటుడు హరీశ్ రాయ్ దయనీయస్థితిలో ఉన్నాడు. థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్సకు ఆర్థిక సాయం చేయాలని దాతలను కోరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆయన చాలా బలహీనంగా, సన్నగా మారిపోయారు. ఇన్‌ఫెక్షన్ సోకి పొట్టలో వాపు వచ్చినట్లు తెలుస్తోంది. హరీశ్ రాయ్ చికిత్సకు ఆస్పత్రి ఖర్చులు భరిస్తానని కన్నడ హీరో ధృవ సర్జా హామీ ఇచ్చారు.