ఖైరతాబాద్ ఉప‌ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని కుమారుడికి ఛాన్స్?

10చూసినవారు
ఖైరతాబాద్ ఉప‌ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని కుమారుడికి ఛాన్స్?
TG: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ లేదంటే రేపు సుప్రీంకోర్టు తీర్పునిచ్చే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థిస్తే, ఖైరతాబాద్ లో ఉపఎన్నిక అనివార్యం కానుంది. ఖైరతాబాద్ టికెట్ కోసం BRS నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే సాయికిరణ్ ను బరిలోకి దింపాలని BRS యోచిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్