TG: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల సందర్భంగా మహిళల భద్రతను లక్ష్యంగా చేసుకుని షీ టీమ్స్ నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 1,100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ డ్రైవ్‌లో 26 బృందాలు పాల్గొన్నాయి. వేధింపులకు పాల్పడిన 51 మంది మైనర్లకు కౌన్సెలింగ్ ఇవ్వగా, 26 మంది మేజర్లకు కోర్టు శిక్షలు విధించింది. గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా 26కు పైగా షీ టీమ్స్‌తో భద్రతను కట్టుదిట్టం చేశామని, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డీసీపీ లావణ్య హెచ్చరించారు.