ఖైరతాబాద్ మహాగణపతి.. నిమజ్జనం ఎప్పుడంటే?

16చూసినవారు
TG: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ఈ ఏడాది 12 రోజులు జరగనున్నాయి. ప్రతి ఏటా 11 రోజులు జరిగే ఈ ఉత్సవాలు, ఈసారి అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేయనున్నారు. ఈసారి ఆ ముహూర్తం సెప్టెంబర్ 25న (శుక్రవారం) రావడంతో, అదేరోజు ఖైరతాబాద్ మహా గణపతిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు ‘శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నారు.

సంబంధిత పోస్ట్