
భారత్‌తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించి జింబాబ్వే
టీ20 ప్రపంచ ఛాంపియన్ టీమిండియాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా సారథ్యంలోని జింబాబ్వే జట్టు జులై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా టీమిండియాతో తలపడనుంది. జట్టులో సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, తనకా చివంగా, బెన్ కర్రాన్, బ్రాడ్ ఎవాన్స్, వెస్లీ మాధవెరె, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియోన్ మైయర్స్, రిచర్డ్ నగరావా, న్యూమాన్ న్యాంహురి, మిల్టన్ షుంబా, తఫాడ్జ్వా సిగా ఉన్నారు.




