కెనడాలో హిందువులపై ఖలిస్థానీల దాడి (వీడియో)

607చూసినవారు
కెనడాలో హిందూ భక్తులపై ఖలిస్థానీలు దాడికి పాల్పడ్డారు. బ్రాంప్టన్‌లోని హిందూ సభా మందిరంలోని భక్తులపై ఆదివారం ఖలిస్థానీలు దాడి చేశారు. కాగా.. హిందువులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వీడియోను స్థానికులతో పాటు ఎంపీలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో ఖలిస్థానీ జెండాలు పట్టుకున్న గ్రూప్స్ కర్రలతో పిల్లలు, మహిళలపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్