నగదు కోసం స్నేహితుడే నరికి, ముక్కలు చేసి పడేశాడు

48543చూసినవారు
నగదు కోసం స్నేహితుడే నరికి, ముక్కలు చేసి పడేశాడు
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సెప్టెంబర్ 15న హైదరాబాద్‌కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన వెంకటేశ్వర్లు(38) అదృశ్యమైన కేసులో ఆయన స్నేహితుడు అశోక్ ప్రధాన నిందితుడిగా తేలాడు. వెంకటేశ్వర్లు వద్ద ఉన్న నగదు కోసమే ఈ హత్యకు ప్లాన్ చేశాడు. సెప్టెంబర్ 16న వెంకటేశ్వర్లును తన రూమ్‌కు పిలిపించి నిద్రిస్తున్న సమయంలో ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత శరీరం భాగాలను బైక్‌పై ఖమ్మం శివారు ప్రాంతాల్లో పడేశాడు.