ఆళ్లపల్లి మండలంలోని రామంజిగూడెం గ్రామంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ట్రాక్టర్ ఇంజిన్ డ్రైవర్‌పైనే బోల్తా పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వెంటనే స్పందించి, ట్రాక్టర్ ఇంజిన్‌ను పక్కకు తొలగించి, గాయపడిన డ్రైవర్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.