ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పాయపురి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కరెంటు స్తంభాన్ని ప్రభుత్వ లైన్మెన్లు పట్టించుకోకపోవడం వలన గ్రామస్తులు అసంతృప్తి చెందుతున్నారు. వరి పొలాల్లో ఉన్నటువంటి స్తంభాన్ని ఇకనైనా ప్రభుత్వాధికారులు జీతం తీసుకుంటున్నటువంటి లైన్మెన్లు స్పందించి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న స్తంభాన్ని తీసివేసి సరి చేయాలని చుట్టుపక్కల ఉన్నటువంటి వరి పొలాల రైతులు కోరుతున్నారు. లేనియెడల కలెక్టర్ ఆఫీస్ కి ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులందరూ కలిస కలెక్టరేట్ కి వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.