భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు. సీడీపీవో పరిధిలోని 130 ఆయా పోస్టులకు ఆన్లైన్ ద్వారా 628 దరఖాస్తులు అందినట్లు సీడీపీవో హేమ సత్య తెలిపారు. దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.