అశ్వారావుపేట: చెరువులో మృతదేహం లభ్యం

1678చూసినవారు
అశ్వారావుపేట ఊట్లపల్లి పరిధిలోని గంగారం చెరువులో శనివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. చెరువు నీటిపై మృతదేహం తేలియాడుతుండటాన్ని గమనించిన పశువుల కాపరులు, రైతులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు శుక్రవారం చేపల వేట కోసం తెప్పపై చెరువులోకి వెళ్లి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి దుర్వాసన వస్తుండటంతో, పోలీసులు దానిని వెలికితీసే చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్