అశ్వారావుపేట: దొంగనోట్ల ముఠా అరెస్ట్

1765చూసినవారు
అశ్వారావుపేటలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు అయింది. మంగళవారం, దొంగనోట్లను చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఇంట్లో నకిలీ కరెన్సీ తయారవుతోందన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేశారు. పోలీసులను చూసి భయపడిన నిందితులు, సాక్ష్యాలను నాశనం చేసేందుకు నకిలీ నోట్లను తగులబెట్టే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

సంబంధిత పోస్ట్