అశ్వారావుపేట మండలంలో సోమవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా కారం మల్లయ్య ఇల్లు దగ్ధమైంది. కొమ్ముకోయ కళాబృందం సభ్యుడైన మల్లయ్య ఇంట్లో మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న నిత్యావసరాలు, వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.