అశ్వారావుపేట మండలంలోని నల్లబాడులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. రైతు వద్దిరాజు నరసింహారాజుకు చెందిన పొగాకు బేరన్లో బాదులు విరిగి పొయ్యి మీద పడటంతో మంటలు చెలరేగి బేరన్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. తమను పొగాకు బోర్డు అధికారులు ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు.