దమ్మపేట మండల కేంద్రంలో మంగళవారం ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం 10 గంటలకే భానుడి భగభగలతో ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. రహదారులపై పాదచారులు ఎండ వేడిమికి ఇబ్బందులు పడ్డారు. వీపు మాడేలా ఎండ తీవ్రత కనిపించడంతో అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే బయటకు వచ్చారు. ఎండ నుంచి రక్షణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు.