ఆవులను తరలిస్తున్న కంటైనర్ పట్టివేత

4చూసినవారు
ఆవులను తరలిస్తున్న కంటైనర్ పట్టివేత
దమ్మపేటలో ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా 90 ఆవులతో వెళ్తున్న కంటైనర్‌ను భాగ్యనగర్ గోరక్షక్ కమిటీ సభ్యులు చాకచక్యంగా పట్టుకున్నారు. కబేళాకు తరలిస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఏపీలోని కొవ్వూరు నుంచి వెంబడించి దమ్మపేట వద్ద అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. కంటైనర్‌లో గోవులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన ఆవులను హనుమాన్ జంక్షన్ గోశాలకు తరలించగా, డ్రైవర్, ఇద్దరు క్లీనర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్‌కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్