దమ్మపేట: చెట్టును ఢీకొన్న కార్.. ఒకరు మృతి

1048చూసినవారు
దమ్మపేట మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పట్వారీగూడెం సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరికొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.