బస్టాండ్‌ వద్ద వృద్ధురాలిని వదిలేసిన కుటుంబసభ్యులు

0చూసినవారు
అశ్వారావుపేట బస్టాండ్‌ వద్ద 80 ఏళ్ల భద్రమ్మను కుటుంబసభ్యులు ఆటోలో తీసుకొచ్చి వదిలేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న ఆమె నాలుగు రోజులుగా అక్కడే ఉండటంతో స్థానికులు గుర్తించి స్నానం చేయించి, భోజనం అందించారు. కుమార్తెకు సమాచారం ఇవ్వగా తమకు సంబంధం లేదని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. వృద్ధురాలికి వైద్యం అందించి, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్