బంగారం తాకట్టు పేరుతో మోసం.. కేసు నమోదు

4చూసినవారు
బంగారం తాకట్టు పేరుతో మోసం.. కేసు నమోదు
అశ్వారావుపేట పట్టణంలోని ఓ బ్యాంకులో బంగారు ఆభరణాల తాకట్టు వ్యవహారంలో మోసం జరిగిందన్న ఫిర్యాదుపై నాగసుబ్రహ్మణ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై యయాతిరాజు తెలిపిన వివరాల ప్రకారం. ఖాతాదారుల నుంచి ఆభరణాలు తీసుకుని నగదు, రసీదులు ఇచ్చి, వాటిని వారి అనుమతి లేకుండా ఇతర పేర్లపై తాకట్టు పెట్టి రుణాలు పొందినట్లు ఫిర్యాదులు అందాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్