భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమైన వర్షం బుధవారం ఉదయం వరకు కొనసాగుతోంది. దీంతో మండలంలో జనజీవనం స్తంభించింది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.