భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి బంగాళాదుంపల మధ్య అచ్చం ఆలుగడ్డ ఆకారంలో ఉన్న గులకరాయి కనిపించింది. తొలుత అది బంగాళాదుంపేనని భావించినా, పరిశీలించగా రాయి అని తేలింది. బంగాళాదుంపలా కనిపించిన ఈ గులకరాయిని చూసి కూరగాయల దుకాణదారులు, కొనుగోలుదారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.