భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏలూరు జిల్లాకు చెందిన కొట్టే చిన్న తులసి రావు (54) అనే వ్యక్తి దుర్మరణం చెందారు. రాచన్నగూడెం నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తులసిరావును మార్గంమధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందిన తులసిరావు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.