ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

2228చూసినవారు
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ కాలనీలో తగరం వెంకటేశ్వరరావు (35) అనే వ్యక్తి మద్యానికి బానిసై, కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా ఉంటున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపం చెంది, ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని తండ్రి తగరం సిద్ధయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అశ్వారావుపేట ఎస్ఐ యయాతి రాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్