ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

2180చూసినవారు
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
అశ్వారావుపేట మండల కేంద్రం మోడల్ కాలనీకి చెందిన తగరం వెంకటేశ్వరరావు (35) అనే వ్యవసాయ కూలీ మద్యానికి బానిసై కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆదివారం సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుతున్న పిల్లలను భార్యతో కలిసి వెళ్లి చూసి వస్తుండగా ఆమెతో గొడవపడటంతో పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన వెంకటేశ్వరరావు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్