ప్రమాదంలో గాయపడిన కూలీలను ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే

2చూసినవారు
ప్రమాదంలో గాయపడిన కూలీలను ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే
అశ్వారావుపేట మండల పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు నారంవారిగూడెం ఆయిల్‌ఫామ్ నర్సరీ సమీపంలో రోడ్డు ప్రమాదం కనిపించింది. కోయరంగాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పని ముగించుకుని ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరగడంతో పలువురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తన వాహనంలో క్షతగాత్రులను అశ్వారావుపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి బాధితులకు తక్షణ చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశిస్తూ చికిత్సను దగ్గరుండి పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్