దమ్మపేటలో 100 మంది గర్భిణులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో సీమంతాలు

0చూసినవారు
భద్రాద్రి జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో దానధర్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం సామూహిక సీమంత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని 100 మంది గర్భిణులకు చీర, సారె, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులతో సత్కరించారు. ముఖ్యఅతిథిగా చిన్న అరుణాచలం వ్యవస్థాపకుడు అరుణానంద స్వామి హాజరయ్యారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక, హెడ్ నర్స్ రత్తమ్మ, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్