పెంపుడు కోళ్లను చంపిన గుర్తుతెలియని వ్యక్తులు ?

1947చూసినవారు
పెంపుడు కోళ్లను చంపిన గుర్తుతెలియని వ్యక్తులు ?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో కక్ష సాధింపు ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గూడా ముత్యాలరావు పెంచుకుంటున్న పెంపుడు కోళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు మందు పెట్టి చంపినట్లు సమాచారం. మనుషులపై ఉన్న కోపాన్ని మూగజీవాలపై చూపిస్తూ కోళ్లను హతమార్చడంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై బాధితుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్