ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలోని బాలంపేట గ్రామ ఉపసర్పంచ్ తాలూరి పెద్ద అమరయ్య అనారోగ్యంతో మరణించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు రాజకీయ నాయకులు, గ్రామస్థులు అమరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.