భద్రాచలం ఆస్పత్రిలో 400 కంటి ఆపరేషన్లు

2043చూసినవారు
భద్రాచలం ఆస్పత్రిలో 400 కంటి ఆపరేషన్లు
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో కంటి శస్త్రచికిత్సలు అందుబాటులోకి రావడంతో ఏజెన్సీ ప్రజలకు సేవలు అందుతున్నాయి. 2023 డిసెంబర్ 15న ప్రారంభమైన ఆపరేషన్లు ఈ నెల 7 నాటికి 400 పూర్తయ్యాయి. గతంలో వారానికి ఒకరోజు నిర్వహించగా, రెండు రోజులు చేస్తున్నారు. రూ. 25 లక్షల ఫ్యాకో పరికరంతో కేటరాక్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రైవేటుతో పోలిస్తే తక్కువ ఖర్చుతో సేవలు అందుతున్నాయి.

సంబంధిత పోస్ట్