భద్రాచలం: చేపల వేటకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి

2చూసినవారు
భద్రాచలం: చేపల వేటకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున చర్ల మండలంలో విషాదం నెలకొంది. మొగళ్లపల్లి గ్రామానికి చెందిన రాముల సూర్యారావు (38) తన ఎనిమిదేళ్ల కుమారుడు దేవన్‌తో కలిసి మంగళవారం చేపల వేటకు వెళ్లారు. వల వేస్తుండగా ప్రమాదవశాత్తు తండ్రీకొడుకులు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సంబంధిత పోస్ట్