భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టౌన్ ఎస్‌హెచ్‌ఓ మేడిపల్లి నాగరాజు బదిలీ అయ్యారు. మల్టీ జోన్-1 పరిధిలో పలువురు సివిల్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ఐజీపీ సంపత్ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాలతో ఈ బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్లు కొత్త పోస్టింగ్ ప్రదేశాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.