ప్రమాదకరంగా బ్రిడ్జిలపై నుంచి భారీ విగ్రహాల నిమజ్జనం

1756చూసినవారు
భద్రాచలం బ్రిడ్జిలపై నుంచి భారీ విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు. ఏర్పాటు చేసిన ఘాట్ల వద్దే నిమజ్జనం చేయాల్సి ఉండగా, బ్రిడ్జిపై నుంచి విగ్రహాలు వేయడం ప్రమాదకరంగా మారింది. భారీ విగ్రహాలతో పాటు నిమజ్జనం చేసే వారు కూడా గోదావరిలో పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చలానాలకే పరిమితమైన ట్రాఫిక్ పోలీసులను బ్రిడ్జిలపై ఏర్పాటు చేసి నిమజ్జనాలను నియంత్రించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్