భద్రాచలంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ముందు శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల 1న జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, మృతుడు వాటర్ బాటిళ్లు, పేపర్లు ఏరుకుంటూ భిక్షాటన చేసే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712682105, 8712682160 నంబర్లలో సంప్రదించాలని భద్రాచలం ఎస్‌హెచ్‌ఓ కోరారు.