ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు

0చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు
భద్రాచలం నుండి చింతూరు మండలం బొడ్డుగూడెం వెళ్లే మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన తుఫాన్ వాహనం లోయలోకి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో 10 మందికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్