భద్రాచలంలో రేపు గోదావరి నది హారతి ప్రారంభం

1290చూసినవారు
భద్రాచలంలో రేపు గోదావరి నది హారతి ప్రారంభం
భద్రాచలంలో శనివారం సాయంత్రం 5:30 గంటల నుండి గోదావరి నది హారతి కార్యక్రమం ప్రారంభం కానుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మొదలైన ఈ కార్యక్రమం ఇకపై ప్రతి శనివారం నిర్వహించబడుతుంది. గోదావరి నది ప్రాముఖ్యతను తెలియజేయడం, పర్యావరణ పరిరక్షణకు ప్రజలను ప్రోత్సహించడం దీని లక్ష్యమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.