భద్రాచలం మన్యం ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారుల నుంచి కిలో రూ. 15-20కు కొనుగోలు చేస్తున్న మధ్యవర్తులు లారీలు, ఆటోలు, బొలేరో వాహనాల్లో ఏపీ, ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. దుమ్ముగూడెంలో దాడుల్లో 275 క్వింటాళ్ల బియ్యం పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. సమాచారం అందితే దాడులు చేసి చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.