భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కొండగులబోడు గ్రామానికి చెందిన భూక్యా వినోద్ (28) అనే యువకుడు ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినోద్ కొత్తగూడెం హోండా షోరూంలో పనిచేస్తున్నాడు. సెలవు దినమైన ఆదివారం ఇంట్లో ఉన్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తలుపులు మూసి ఉండటంతో, అనుమానంతో తలుపులు పగలగొట్టి చూడగా వినోద్ ఉరి వేసుకుని కనిపించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. టేకులపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.