దుమ్ముగూడెం మండలంలోని నడికుడి గ్రామంలో గత 40 ఏళ్లుగా స్వయంభు వినాయకుడికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆనాడు ఒక అడుగు ఉన్న విగ్రహం ఇప్పుడు రెండున్నర అడుగులకు పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. స్వామివారికి సరైన ఆలయం లేకపోవడంతో, ఆలయ నిర్మాణానికి దాతలు, భక్తులు ముందుకు వచ్చి సహాయం అందించాలని స్థానికులతో పాటు
బీజేపీ నాయకులు త్రినాధ్ రెడ్డి, సురేష్ కోరారు.