భద్రాద్రి రామన్న - తిరుమల వెంకన్న మహాపాదయాత్ర లో త్రివేణి డైరెక్టర్లు

598చూసినవారు
భద్రాద్రి రామన్న - తిరుమల వెంకన్న మహాపాదయాత్ర లో త్రివేణి డైరెక్టర్లు
భక్తి, ఆధ్యాత్మికత, సేవా భావాలను మేళవిస్తూ భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధి నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వరకు త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్లు నిర్వహిస్తున్న 8వ మహా పాదయాత్ర అత్యంత భక్తిశ్రద్ధలతో 16 వ తారీఖు ప్రారంభం అయ్యింది.  ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి ఎంతో భక్తి భావంతో చేపడుతున్న ఈ మహా పాదయాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సర్వ మానవ హితం, సమాజ శ్రేయస్సు, ప్రజల సుఖసంతోషాలు, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, దేశ,రాష్ట్ర, అభ్యున్నతి కోసం స్వామివార్ల ఆశీస్సులు కోరుతూ ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్లు గొల్లపూడి వీరేంద్ర చౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వర రావు తెలిపారు. భద్రాద్రి రామన్న సన్నిధి నుంచి ప్రారంభమై, పాల్వంచ, కాకర్ల,మైలవరం,ఇబ్రహీంపట్నం, విజయవాడ, గుంటూరు ల మీదుగా కొనసాగనున్న ఈ ఆధ్యాత్మిక పాదయాత్ర గురువారం  చిలకలూరిపేట కి చేరుకుని ,23 రోజుల తరువాత తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకోనుంది. వీరికి సంఘీభావంగా త్రివేణి విద్యాసంస్థలనుండి రోజుకి ఒకరు చొప్పున పాదయాత్రలో పాల్గొంటున్నారు,అదేవిధంగా పాఠశాలల ఐఐటీ సమన్వయకర్త ,ఖమ్మం బ్రాంచ్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, సి ఏ సి నటరాజ్ లు గుంటూరులో పాదయాత్ర బృందాన్ని కలుసుకుని వారితో పాదం కదుపుతూ ముందుకు సాగారు.మార్గమధ్యంలో భక్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు పాదయాత్రికులకు తమ సహకారం, స్వాగతం అందిస్తూ ప్రతి పట్టణంలో ఒక్కొక్క మొక్కని నాటుతూ ముందుకు సాగుతోంది ఈ ఆధ్యాత్మిక యాత్ర. “భక్తితో అడుగు… సేవతో నడుగు… సర్వ మానవ హితం కోసం సాగు” అనే సందేశంతో ఈ మహా పాదయాత్ర కొనసాగనుంది. త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్లు మాట్లాడుతూ, భగవంతుని అనుగ్రహంతో ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి  చేపడుతున్న ఈ పాదయాత్ర ద్వారా ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు మానవతా విలువలు, సేవా భావం, ఐక్యత, సమాజ శ్రేయస్సు వంటి సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తమ ప్రధాన ఉద్దేశమని డైరెక్టర్లు తెలిపారు. ఈ మహాపాదయాత్ర లో డైరెక్టర్లు గొల్లపూడి వీరేంద్ర చౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వర రావు, పాఠశాల సి ఆర్ ఓ కాట్రగడ్డ మురళీ కృష్ణ,సనత్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా త్రివేణి విద్యాసంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు శ్రేయోభిలాషులు పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్