దిగుబడి లేక మిర్చి రైతు దిగాలు

3చూసినవారు
దిగుబడి లేక మిర్చి రైతు దిగాలు
ఏన్కూర్ ప్రాంతంలో మిర్చి రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు. గత ఏడాదితో పోలిస్తే దిగుబడి సగానికి పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం ఎకరానికి 10-12 క్వింటాళ్లు దిగుబడి రాగా, ఈ ఏడాది 6 క్వింటాళ్లు రావడమే కష్టంగా ఉందని రైతులు తెలిపారు. అయితే, క్వింటాల్ మిర్చి ధర రూ.18 వేల వరకు పలుకుతున్నా, దిగుబడి తగ్గడంతో లాభాలు ఆశించిన స్థాయిలో లేవు. పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతూ, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్