త్రివేణి పాఠశాలలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

1219చూసినవారు
త్రివేణి పాఠశాలలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
సమాజ ఆరోగ్య పరిరక్షణలో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలను తెలియజేస్తూ త్రివేణి పాఠశాలలో డాక్టర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి భారతరత్న డాక్టర్ బిదన్ చంద్ర రాయ్ చిత్రపటానికి పూలమాల అలంకరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు  డాక్టర్  పేర్ల హర్ష తేజ  మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి కార్యక్రమాల పై అవగాహన కల్పించారు. ఆరోగ్యవంతమైన జీవనశైలిని   అలవాటు చేసుకోవాలని,చిన్ననాటి నుంచి మంచి ఆరోగ్యపు అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వైద్యుల సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. విద్యార్థులు నిర్వహించిన  నృత్య ప్రదర్శనలు, డాక్టర్  వేషధారణలు,ఆహుతులను అలరించాయి.పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ *"వైద్యులు మానవాళికి దైవంతో సమానమని, వారి సేవలు ఎంతో అమూల్యమైనవని, సమాజానికి సేవలందిస్తున్న ప్రతి వైద్యునికి త్రివేణి పాఠశాల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నారు. పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకి ఆరోగ్యం పట్ల ఎంతో అవగాహనని కలిగిస్తాయని తెలియజేశారు  .  డాక్టర్స్ డే సందర్భంగా త్రివేణి యాజమాన్యం డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, డాక్టర్ జంగాల సునీల్ కుమార్, డాక్టర్ ప్రియాంక రెడ్డి, డాక్టర్ జాబిశెట్టి గౌతం, డాక్టర్ జాబిశెట్టి రేణుక  వంటి పలువురు ప్రముఖ వైద్యులని కలిసి పుష్పగుచ్ఛాలని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో పాఠశాల సిఆర్ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ స్వప్న ముస్తఫా క్యాంపస్ ఇంచార్జ్ చార్లెస్ ట్రాన్స్పోర్ట్ ఇంచార్జ్ సందీప్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్