హార్వెస్ట్ విద్యాసంస్థ తన 25 సంవత్సరాల అద్భుతమైన ప్రస్థానాన్ని గర్వంగా జరుపుకుంటున్న రజతోత్సవ వేడుకలలో భాగంగా నేడు (అక్టోబర్ 2 శుక్రవారం 2026 న) 'యంగ్ ఇన్నోవేటర్స్ అవార్డ్' వేడుకలు శుక్రవారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో హార్వెస్ట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఇంట్రామ్యూరల్ కాంపిటీషన్స్ అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని 'యంగ్ ఇన్నోవేటర్స్ - ఎ వరల్డ్ ఆఫ్ సైన్స్' పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని హార్వెస్ట్ విద్యాసంస్థల యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
పాఠశాల ప్రాంగణంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 'యంగ్ ఇన్నోవేటర్స్ ఎ వరల్డ్ ఆఫ్ సైన్స్' వేడుకలకు భారత అంతరిక్ష శాస్త్రవేత్త, డీఆర్డీఓ మాజీ ఛైర్మన్, జాతీయ భద్రతా మండలి సభ్యుడు డాక్టర్ జి.సతీష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరవగా, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వందిత్ పామురు గారు, క్వెస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డా॥ కె. నాగమణి, సునోసాల్ సి.యి. ఓ హిమాంసు, హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్. పార్వతిరెడ్డి గార్లు ముఖ్యఅతిధులుగా విచ్చేసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి.సతీష్ రెడ్డి గారు మాట్లాడుతూ
విద్యార్థులు ప్రశ్నించడం, ప్రయోగాలు చేయడం, కొత్త ఆలోచనలకు రూపమివ్వడం ద్వారా భవిష్యత్తులో గొప్ప ఆవిష్కర్తలుగా ఎదగగలరని, విద్యతోపాటు కళలు, సృజనాత్మకతకు సమాన ప్రాధాన్యమిస్తూ విద్యార్థుల సమగ్ర వికాసానికి కృషి చేయాలని, స్ఫూర్తిదాయకమైన మాటలు విద్యార్థుల్లో నూతన ఆలోచనలకు ప్రేరణనిస్తాయని అని వారు పేర్కొన్నారు.
మరో అతిథిగా విచ్చేసిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వందిత్ పామురు గారు మాట్లాడుతూ
విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా నూతన ఆలోచనలు, పరిశోధనాత్మక దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సృజనాత్మకతతో జోడించినప్పుడే నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు.
హార్వెస్ట్ విద్యాసంస్థలలో విద్యనభ్యసించే విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన, హెూమ్ ఎకనామిక్స్, లీఫ్ ఆర్ట్, క్విజ్, డ్రాయింగ్, స్లోగన్ మేకింగ్, వక్తృత్వపోటీలు, లఘుచిత్ర, హెల్దీ రెసిపీస్ తదితర పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయడం జరిగింది.
అనంతరం పాఠశాల కరస్పాండెంట్ పి.రవిమారుత్ గారు, ప్రిన్సిపల్ ఆర్. పార్వతీరెడ్డి గారు మాట్లాడుతూ "విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమన్నారు. పుస్తక జ్ఞానంతోపాటు ఆచరణాత్మక పరిజ్ఞానం, పరిశోధనాత్మక ఆలోచన, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. గాంధీజయంతిని పురస్కరించుకొని మహాత్ముని సేవా ఆలోచనలకు అనుగుణంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న డా. జి.సతీష్‌రెడ్డి గారిని ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించి చిన్నారులకు బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు.
వేడుకలో భాగంగా
విద్యార్థులు ప్రదర్శించే ప్రత్యేక నృత్యరూపకం, సంగీత విభావరి ప్రేక్షకులను అలరించాయి.
విద్యార్థులు, తల్లిదండ్రులు, హార్వెస్ట్, టెండర్ఫ్రూట్స్, స్ప్రింగ్లోఫ్, సెడార్వ్యలీ పిన్సిపల్స్, అకడమిక్ ఇంచార్జ్‌లు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యావేత్తలు తదితరులు పాల్గొన్నారు.