పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో 'హార్వెస్ట్'కు ఉన్నత శ్రేణి ఫలితాలు

5చూసినవారు
పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో 'హార్వెస్ట్'కు ఉన్నత శ్రేణి ఫలితాలు
పత్రికా ప్రకటన
పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో 'హార్వెస్ట్'కు ఉన్నత శ్రేణి ఫలితాలు
తెలంగాణా రాష్ట్రప్రభుత్వం బుధవారం విడుదల చేసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షాఫలితాల్లో తమ విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నత మార్కులు సాధించి, అగ్రశ్రేణిలో నిలిచారని 'హార్వెస్ట్' గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల యాజమాన్యం 'బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
2025-26 విద్యాసంవత్సరానికిగానూ, బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థిని గుండ్ల జశ్వంతి 584/600 మార్కులు సాధించి పాఠశాల అగ్రస్థానంలో నిలిచారన్నారు. తదుపరి మాహిరా మీర్జా 583/600, ఉదారపు చరణ్ 579/600, కొల్లి సిద్దార్థ్ 579/600, కె. శ్రీరేష్మ 576/600, చింతల సాయి తరుణ్ 576/600, వై. దీపికారెడ్డి 574/600, వి.హర్షిత్ 574/600 మార్కులు సాధించి ఉన్నత శ్రేణిలో నిలిచారన్నారు.
తమ విద్యార్థినీ, విద్యార్థులు 550 మార్కులకి పైగా 28మంది, 500 మార్కులకి పైగా 80 మంది సాధించారని వారు వివరించారు. నబ్జెక్టుల వారీగా తెలుగులో 63 మంది, హిందీలో 29 మంది, ఇంగ్లీషులో 57 మంది, గణితంలో 44 మంది, సైన్స్లో 45 మంది, సోషల్లో 76 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఎ1 గ్రేడ్లు సాధించడం జరిగిందన్నారు. స్కూల్ యావరేజ్ మార్కు 502 ఉండగా నబ్జెక్ యావరేజెన్ తెలుగు 85.5, హిందీ 77, ఇంగ్లీష్ 85.26, గణితం 82, సైన్స్ 85, సోషల్ 87 గా ఉన్నాయి. తమ పాఠశాల నుండి 141 మంది విద్యార్ధినీ విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవగా 100 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు.
బుధవారం పాఠశాల ఆవరణలో 'హార్వెస్ట్' గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి. రవిమారుత్ గారు, ప్రిన్సిపల్ ఆర్. పార్వతీరెడ్డి గార్లు విద్యార్థినీ, విద్యార్థులను అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అభిలషించారు.
Job Suitcase

Jobs near you