Apr 20, 2026, 14:04 IST/సత్తుపల్లి
సత్తుపల్లి
అగ్నిమాపక వారోత్సవాలు... సత్తుపల్లిలో మాక్ డ్రిల్
Apr 20, 2026, 14:04 IST
సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ గురజాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ ఆస్తులలో అగ్ని ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలపై అవగాహన అవసరమని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదం సంభవించినప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిపై అగ్నిమాపక శాఖ సిబ్బంది సోమవారం సత్తుపల్లి బస్టాండ్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.